Rakshinchu Rakshinchu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rakshinchu Rakshinchu Lyrics ॥

కాంభోజి – త్రిపుట

పల్లవి:
రక్షించు రక్షించు రక్షించు రక్షించు
రామచంద్రా నన్ను శిక్షింప వచ్చిరి
శీఘ్రముగ కృప జూడు రామచంద్రా ర ॥

చరణము(లు):
రాచకార్యమేమొ రచ్చకు వచ్చెను
రామచంద్రా నన్ను రాజ రాజవన
రాపు చేసెదవేల రామచంద్రా ర ॥

కలకాలము నిన్ను కాంక్షించి వేడితి
రామచంద్రా యే ఫలముగాననైతి
పాలించి బ్రోవవే రామచంద్రా ర ॥

ధర్మాత్ముడవని తలపోసితినయ్య
రామచంద్రా యింత నిర్మోహివగుట నే
నెరుగలేనైతి రామచంద్రా ర ॥

పార్థివముఖ్య పౌరుషయుత శ్రీ
రామచంద్రా నిన్ను ప్రార్థించి వేడెద
పక్షముంచగదయ్య రామచంద్రా ర ॥

కరుణమారి భటులు కఠినోక్తులాడగ
రామచంద్రా నీ కరుణాకటాక్షము
కానరాదాయెను రామచంద్రా ర ॥

ప్రేమ భద్రశైలధాముడవై నీవు
రామచంద్రా శ్రీరామదాసును వేగ
రక్షింప రావయ్య రామచంద్రా ర ॥

Other Ramadasu Keerthanas:

See Also  Shiva Kesadi Padantha Varnana Stotram In Telugu