Raksimpu Midi Yemo In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Raksimpu Midi Yemo Lyrics ॥

శంకరాభరణ – రూపక ( – త్రిపుట)

పల్లవి:
రక్షింపు మిది యేమొ రాచకార్యముపుట్టె రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర ర ॥

చరణము(లు):
అప్పులవారితో అరికట్టుకొన్నారు రామచంద్రస్వామి
చెప్పశక్యముకాదు చక్షుర్గోచరమాయె రామచంద్ర ర ॥

పక్షివాహన నన్ను పాలింపదయజూడు రామచంద్రస్వామి
అక్షయకటాక్ష మభిమానముంచవే రామచంద్ర ర ॥

కుక్షిలో మీమీద కోరికపుట్టెను రామచంద్రస్వామి
యిక్ష్వాకుకులతిలక యికనైనగావవే రామచంద్ర ర ॥

అధికుని చేపట్టి తడ్డమేమనుకొంటి రామచంద్రస్వామి
అధములకన్నను అన్యాయమైపోతి రామచంద్ర ర ॥

భయమేమి నే రామదాసుడ ననుకొంటి రామచంద్రస్వామి
భయముబాపి బ్రోవు భద్రాద్రిపురి నిలయ రామచంద్ర ర ॥

Other Ramadasu Keerthanas:

See Also  Harivarasanam In Telugu