Raksincedoravani Nammiti In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Raksincedoravani Nammiti Lyrics ॥

బిలహరి – ఆది (-త్రిపుట)

పల్లవి:
రక్షించేదొరవని నమ్మితి నన్ను
శిక్షింపగ తప్పేమి చేసితిని ర ॥

రక్షించ మీకంటె రక్షకులెవరున్నారు
దాక్షిణ్యమింతైన తలపున నుంచవు ర ॥

చరణము(లు):
నీప్రాపు నెరనమ్మియుంటిని నన్ను
కాపాడు బిరుదు నీదంటిని రామా నన్ను
చేపట్టి విడనాడ జెల్లదు నిక నాకు
దాపుననుండెడి దైవము సాక్షిగ ర ॥

ఎంతోవేడిన యేలపల్కవు నే
నెంత ద్రోహినో దయ జూడవు రామా
ఎంతేసివారల నేలేటికర్తవు
అంతకంతకు నాపై యరమర చేసేవు ర ॥

భద్రాద్రివాస నీబంటును నితర
పాపము లేదు నావెంటను రామా
అద్రిజ సన్నుత అమరాదివందిత
భద్రేభవరద నాపాలిటిదైవమ ర ॥

Other Ramadasu Keerthanas:

See Also  Narayaniyam Catuscatvarimsadasakam In Telugu – Narayaneyam Dasakam 44