Raksincudinuni Ramarama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Raksincudinuni Ramarama Lyrics ॥

పున్నాగవరాళి – ఆది (- త్రిపుట)

పల్లవి:
రక్షించుదీనుని రామరామ నీ రమణితోడు నన్ను
రక్షింపకున్నను మీతండ్రి దశరథరాజు తోడు ర ॥

చరణము(లు):
అరుదుమీరగ విభీషణుని బ్రోచితివల్లనాడు అట్లు
కరుణింపకున్నను మీతల్లి కౌసల్యాదేవి తోడు ర ॥

గిరికొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితివి అల్లనాడు అట్లు
సిరులియ్యకున్నను మీకులగురువు వసిష్ఠుని తోడు ర ॥

అలివేణి యహల్య శాపము బాపితి వల్లనాడు అట్లు
కలుషములన్నియు బాపకున్న లక్ష్మణుని తోడు ర ॥

పాపాత్ముడైన కబంధు బ్రోచితి వల్లనాడు అట్లె
నెపములెన్నక కృపజూడకున్న మీయింటితోడు ర ॥

వదలక నీమీదనే నానలు పెట్టవలసె నేడు
భద్రాచల రామదాసుని యేలకున్న నీ పాదము తోడు ర ॥

Other Ramadasu Keerthanas:

See Also  Rama Raksha Stotram In Telugu