Rama Chandrulu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Chandrulu Lyrics ॥

పల్లవి:

రామ చంద్రులు నాపై చలము చేసి నారు సీతమ్మ చెప్ప వమ్మ ॥

చరణములు:

కట కట విన డేమి సేయుదు కఠిన చిత్తును మనసు కరుగద
కర్మములు యెటు లుండు నో కదా ధర్మ మే నీ కుండు నమ్మ ॥

దిన దినము నీ చుట్టు దీనత తో తిరుగ దిక్కెవ్వ రింక మాకోయమ్మ ॥

దీన పోషకు డనుచు వేడితి దిక్కు లన్నియు ప్రకట మాయెను
వక్క మాటైనను వినడు ఎక్కు వేమని తలతు నమ్మ ॥

కౌసల్య తనయుడు కపటము చేసినాడు కారణ మిటుండెను
కన్నడ చేసెదవా నీ కన్నుల వైభవంబు విన్న వింప గదమ్మ
నీ కన్న దిక్కెవ్వ రో యమ్మ ॥

దశరఠాత్మజుడెంతో దయశాలి యను కొంటి ధర్మ హీనుడే యమ్మ
దాస జనులకు దాత యతడట వాసిగ భద్ర గిరీశుడట
రామ దాసుని యేల రాడట రవి కులాంబుది సోము డిత డట ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Rama Chandrulu Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Narayaniyam Dvipancasattamadasakam In Telugu – Narayaneyam Dasakam 52