Rama Dayajudave Judave In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Dayajudave Lyrics ॥

కల్యాణి – ఆట (ధన్యాసి – ఆది)

పల్లవి:
రామా దయజూడవే భద్రాచల
రామా నను బ్రోవవే సీతా రా ॥

రామా దయజూచి రక్షించి మమ్మేలు
రామా రణరంగ భీమా జగదభి రా ॥

చరణము(లు):
రాజీవదళలోచన భక్తప
రాధీనా భవమోచనా
రాజరాజకుల రాజరాజార్చిత
రాజిత వైభవ రాజలలామ రా ॥

తాటక సంహరణా మేటి
కోటి రాక్షసకోటి హరణా
నీటుగా శ్రీరామకోటి వ్రాసితి నీకు
సాటిలేరని సారెసారెకు వేడితి రా ॥

దిక్కు నీవని నమ్మితి నీ పాదములు
మక్కువగని మ్రొక్కితి
చిక్కులుపెట్టకు శ్రీ రామదాసుని
చక్కగ బ్రోవవె చక్కని జానకి రా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Rama Dayajudave Judave Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  1000 Names Of Sri Ganesha Gakara – Sahasranamavali Stotram In Telugu