Rama Namame Jeevanamu Anyam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Namame Jeevanamu Anyam Lyrics ॥

ఆనందభైరవి – చాపు ( -త్రిపుట)
పల్లవి:
రామనామమే జీవనము అన్య మేమిరా కృపావనము
రామనామ సుధామధురము అది ఏమరక భజియించు మాకిక రా ॥

చరణము(లు):
శ్రీలమేలు భయానకము రఘువీరుల పేరే పానకము
పాలుమీగడ జారుతేనియ పాలకన్నను మేలిమైనది రా ॥

ఈ రసములెల్ల నీరసము రఘువీరుని కథలెల్ల పాయసము
సారెకు మాకు చేకూరెను ఆకలి తీరి తృష్ణ చల్లారెను రా ॥

ఘోరభవసింధు తారకము హృదయారి వర్ణనివారకము
సారమౌ ఘనసార కదళీఫలసార సౌఖ్యమా పారము రా ॥

సుందర శ్రీరాములు రఘునందనాంఘ్రి సరోజములు
చెంది బ్రహ్మానందభావము నందరికి నింపొందజేసిన రా ॥

భాసమాన శుభకరము నిజదాసలోక వశీకరము
భూసుత హితుడై భద్రాచలవాసుడై రామదాసునేలిన రా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Rama Namame Jeevanamu Anyam Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  1000 Names Of Mahaganapati – Sahasranama Stotram 1 In Telugu