Rama Ni Muddumomu Jupu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama ni Muddumomu Jupu Lyrics ॥

అసావేరి – ఏక

పల్లవి:
రామా నీ ముద్దుమోము జూపు సుందరరామా
నీ ముద్దుమోము జూపరరామా భద్రాచలధామా తారకనామా రా ॥

చరణము(లు):
నీ ముద్దుమోము నేగంటిగా నిన్ను చాల నే నమ్మి యున్నానుగా
నేనితరదైవముల వేడబోనుగా విడువనని బిరుదు గట్టుకొన్న
నిన్నేగాని యొట్టుబెట్టుకొంటిర గొప్పుల కుప్పవంటి రా ॥

మురిపెంపు కొప్పు బిగివీడగా ఆణిముత్యాల సరులాడగా
లేమి కిరవయినడు మసియాడగ అట్టు బిరబిర వచ్చి
మీ పినతల్లి సుమిత్ర స్థిరముగ కస్తూరి తిలకము దిద్దినట్టి రా ॥

డాలైన వల్లెవాటు చెలగంగా యింద్రనీలాల గుంపు సొంపుగుల్కగా
నట్లు హేమాద్రి బ్రహ్మమని పల్కగా
చిన్నబాలుండవైనట్టి జాబిల్లి కూనవింటి రా ॥

ముక్కున ముత్య మింపుమీరగా చెక్కుటద్దము ముద్దుగుల్కగా
చనుముక్కున పాలధారలొల్కగా ప్రేమ మిక్కుటమునవచ్చి
మీతల్లి కౌసల్య యక్కునజేర్చి నెలబాలు జూపినయట్టి రా ॥

ముద్దుగదుర యింపొందగా మోదమందించుచు లాలింపగా
ముద్దులన్నా రమ్మని దీవింపగా సురలు వెన్నుడే రాముడని
వినుతింప భద్రాద్రి వెన్నుడయినట్టి చిన్నారి బాలుడ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Viresh Varabhilash Ashtakam – Vishveshvara Stotram In Telugu