Rama Nidayaraduga Patitapavana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Nidayaraduga Patitapavana Lyrics ॥

వరాళి – ఆది (శహన – త్రిపుట)

పల్లవి:
రామ నీదయరాదుగా పతితపావన
నామమే నీ బిరుదుగా శ్రీరామా రా ॥

చరణము(లు):
సామజవరదా నిన్నేమని దూరుదు
ఏమి యదృష్టమో ఎంతవేడిన రావు రా ॥

ఈవులడుగ జాలగా శ్రీపాద
సేవ మాకు పదివేలుగా రామ
భావజ జనక నీ భావము దెలిసియు
నీవు దైవమనుచు నేనమ్మియున్నాను రా ॥

నీకే మరులుకొంటిగా నే నితరు
లకు లోనుగాక యుంటిగా రామా
ఆకొన్నవాడనై యనవలసియుంటిగాని
నీకు దయరాకున్న నేనేమిచేయువాడ రా ॥

ప్రేమ నిబ్బరమాయెగా భద్రాచల
ధామాయని మేమో మాయెగా రామా
భూమిజ నాయక నా స్వామి నీవనుచు
కామించి సేవించు రామదాసుని బ్రోవ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Sri Devasena In Telugu