Rama Rama Neeve Gatigada In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Rama Neeve Gatigada Lyrics ॥

ముఖారి – ఆది

పల్లవి:
రామ రామ నీవే గతిగద సంరక్షణంబు చేయ
వేమనందు హా దైవమ నీ మనసింక కరుగదాయె శ్రీ రా ॥

చరణము(లు):
పుడమిలోన నావంటి అభాగ్యుడు
పుట్టడింకనంటి రామ
విడువబోకు మయ్యాయని మున్నే
విన్నవించుకొంటినయ్యా రామ రా ॥

ఎన్నివిధంబుల పిలిచిన పలుకవు
ఏమదృష్టమంటి రామ
ఎన్నరాని వైవశ్యత వేదన
కెట్లు తాళుకొందు రామ రా ॥

న్యాయమటయ్యా మ్రొక్కగ నా మొర
యాలకించి రావు రామ
శ్రీయుతముగ నిను నమ్మినదాసుల
కోర్కెల నొసగినావు రా ॥

స్వామినేను నీవాడను నాయెడ
చలము చేయకయ్యా రామ
ప్రేమమీరగను నిను గొనియాడెద
మోము జూపవయ్యా రామ రా ॥

నేను మొప్ప భద్రాచలమందిర
నిన్ను నమ్మలేదా రామ
ప్రేమజూడు నీ బంటును శ్రీరామ
దాసు నేలరాదా రామ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Gayatri Mantram Ghanapatham In Telugu