Rama Rama Rama Sri Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Palayamam Jaya Rama Jaya Lyrics ॥

యమునాకళ్యాణి – ఆది

పల్లవి:
రామ రామ రామ శ్రీ రఘు
రామ రామ రామ రామ రా ॥

చరణము(లు):
నరహరిదేవ జనార్దన కేశవ
నారాయణ కనకాంబరధారి రా ॥

రవికులాభరణ రవిసుతసఖ్య
రాక్షససంహార రాజసేవిత రా ॥

పన్నగశయనా పతితపావనా
కన్నతండ్రి యో కరుణాసాగరా రా ॥

కంతుజనక త్రిపురాంతక సాయకా
సీతానాయక శ్రీరఘునాయక రా ॥

సుందర శ్రీధర మందరోద్ధార
మకుటభూషణా ముద్భక్షకహరి రా ॥

నందనందనా నందముకుంద
బృందావిహారి గోవిందహరి రా ॥

వామన మాధవ వైకుంఠాధిప
దేవదేవ దేవారివిదారి రా ॥

పంకజలోచన పరమదయాళో
శంకరసన్నుత సర్వేశ్వరహరి రా ॥

పుండరీక వరదాండజవాహన
చండనిశాచరఖండనధీరా రా ॥

అంబరీష వరదాంబుజ లోచన
అంబుధిబంధన అమితపరాక్రమ రా ॥

భానుకులేశ భవభయనాశ
భాసురహాస భద్రగిరీశ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Yamunashtakam 5 In Telugu