Rama Rama Sita Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Rama Sita Rama Lyrics ॥

కన్నడ – ఏక (దేవగాంధారి – ఆది)

పల్లవి:
రామ రామ సీతా రామ
రామ రామ రామ సీతా రా ॥

చరణము(లు):
రాదా దయ ఇక నామీద యిపుడైన
పాదములకు మ్రొక్కెద పలుమారు విన్నవించెద రా ॥

తప్పులెంచబోకు నీ గొప్పతనము చెల్లదు నే
ఎప్పుడు నిన్నేనమ్మితి తప్పక నన్ను రక్షించుము రా ॥

ఏల ప్రత్యక్షము కావయ్య యేమి చేయుదు రామయ్య
జాలము చేయకుమయ్య శరణంటిని గదయ్య రా ॥

ఎంతకాలము నీదుమాయ ఎన్నటికి తెలియదాయె
అంతరంగము తెలుపవాయె ఆపదలు తొలగవాయె రా ॥

పతితపావన నామబిరుదు పాలించుకో మోసబుచ్చకు
ఇతరుల నే వేడ నీకు ఈశ్వరా యేల పరాకు రా ॥

నమ్మితినే గాక నాచేత నేమౌను నీకృపలేక
మిమ్ము నేవేడెదెందాక మీ సొమ్మైనాను పరాకా రా ॥

ఇక్ష్వాకు వంశమున బుట్టి యేమయ్యా నను చేపట్టి
రక్షింపవదియేటి న్యాయమొ రామా దశరథ పట్టి రా ॥

భద్రగిరిరామ నీ పదభక్తిని వదలి ఏమరి
మారుదైవముల గొలిచేనా చూడు మీదయ మరవకుమీ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  1000 Names Of Narmada – Sahasranama Stotram In Telugu