Rama Rara Bhadrachala Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Rara Bhadrachala Rama Lyrics ॥

నీలాంబరి – ఆది
పల్లవి:
రామా రారా భద్రాచల రామా రార రామ రామ రా ॥

చరణము(లు):
రామా రారా నీమోమిపుడే ప్రేమతీర చూతుగాని
తామసము వలదు రామ స్వామి తాళజాలనికను రా ॥

ఎన్నడు నే నిన్ను నమ్మి యున్నవాడనని యెంచి
కన్నులెత్తి చూచి నన్ను మన్ననతో బ్రోవ రాదా రా ॥

మాటిమాటికి నీతోటి సాటి వేల్పులు లేరని
చాటుచున్న నన్ను నీవె పాట్లు పెట్ట నీటగునటరా రా ॥

భద్రగిరి రామదాసపాలకుడవై నీవేల
ఛిద్రములెల్ల తొలగించి భద్రముగ నన్నేలవేల రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Kapila Gita In Telugu