Ramabhadra Ra Ra In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramabhadra Ra Ra Lyrics ॥

శంకరాభరణ – ఆది

పల్లవి:
రామభద్ర రార శ్రీరమచంద్ర రారా
తామరసలోచన సీతాసమేత రారా రా ॥

అను పల్లవి:
ముద్దుముద్దు గారగ నవమోహనాంగ రారా
నిద్దంపు చెక్కిళ్ళవాడ నీరజాక్ష రారా రా ॥

చరణము(లు):
చుంచు రవిరేఖతో నీ సొంపు జూతు రారా
పంచదార చిలక నాతొ పలుకుదువు రారా
పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారా
గట్టిగ కౌసల్య ముద్దుపట్టి వేగ రారా రా ॥

నిన్ను మానలేనురా నీలవర్ణ రారా
కన్నులపండువుగా కందు కన్నతండ్రి రారా
అందెలు మువ్వలచేత సందడింప రారా
కుందనపు బొమ్మ యెంతొ అందగాడ రారా రా ॥

నాయెడల దయయుంచి నల్లనయ్య రారా
బాయక యెప్పుడు నీ బంటునయ్య రారా
పాదుకొన్న ప్రేమ నిబ్బరమాయె రారా
పాదసేవకుడను నే ప్రత్యక్షముగ రా రా రా ॥

ముజ్జగములకు నాది మూలబ్రహ్మ రారా
గజ్జల చప్పుళ్ళు ఘల్లుఘల్లుమన రారా
సామగానలోల నాచక్కనయ్య రారా
రామదాసునేలిన భద్రాద్రివాస రారా రా ॥

See Also  Shiva Stotram Swami Vivekananda In Telugu