Ramaho Sitaramaho In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramaho Sitaramaho Lyrics ॥

అహిరి – ఆది (కేదారగౌళ – ఆది)

పల్లవి:
రామహో సీతారామహో రామహో సీతారామహో రా ॥

చరణము(లు):
రామహో శరణన్న నా మొరాలించి కావవు
ప్రేమలేదు గదరా నా దుష్కర్మమేమొ తెలియదాయె రా ॥

మ్రొక్కి నిన్ను వేడగా నాదిక్కుజూడవేమి చేతు
చక్కనయ్య నీ నా యందు ఎక్కడి వైరము బుట్టె రా ॥

ఎట్టకేలకైన నిన్ను గట్టిగ నమ్మితి నేను
పెట్టుపోతలడుగలేదు పట్టిమాటాడగరాదా రా ॥

నన్ను సంరక్షించుటది ఎన్నరాని బరువదేమి
మన్ననజేసి నేడు నాకన్నుల కెదురై వసింపు రా ॥

దినదినము నీచుట్టు దీనుడై నే తిరుగగాను
కనికరమింతైన లేక కఠినుడైనావు గదరా రా ॥

సారెసారెకు నిన్ను వేడి భారకుడవనుచు నమ్మి
కోరి పిలిచితేను నన్ను తేరిచూడవేమి చేతు రా ॥

చాలగ నమ్మితి రఘుస్వామి భద్రశైలవాసా
ఏలుకొనుము రామదాసు నెప్పుడేమరకుండ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Manmahaprabhorashtakam Shrisvarupacharitamritam In Telugu