Ramakrishna Govinda Narayana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramakrishna Govinda Narayana Lyrics ॥

యమునాకల్యాణి – ఆది

పల్లవి:
రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ
రామకృష్ణ గోవింద నారాయణా రా ॥

చరణము(లు):
రామకృష్ణ యనిప్రేమతో పిలిచిన
మోము జూపవేమి నారాయణా రా ॥

అండజవాహన పుండరీకాక్ష నీ
దండ జేరినామయ్య నారాయణా రా ॥

మాధవవిష్ణు మధుసూదన శేషశయన
శ్రీధర శ్రీమన్నారాయణా రా ॥

వాసుదేవా ముకుంద వనమాలి చక్రధర
నారసింహాచ్యుతన్నారాయణా రా ॥

పతితుడని నిన్ను బ్రతిమాలుకొన్న సీతా
పతి నను గావవేమి నారాయణా రా ॥

రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల
ధాముడవైన శ్రీమన్నారాయణా రా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Ramakrishna Govinda Narayana Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Runa Vimochana Narasimha Stotram In Telugu