Ramanamamu Balkave In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramanamamu Balkave Lyrics ॥

పంతువరాళి – ఆది ( – త్రిపుట)

పల్లవి:
రామనామము బల్కవే పాపపుజిహ్వ
రామనామము బల్కవే పాపపుజిహ్వ శ్రీ రా ॥

అను పల్లవి:
రామనామము నీవు ప్రేమతో బల్కిన
స్వామి యెల్లప్పుడు కామితార్థములిచ్చు శ్రీ రా ॥

చరణము(లు):
మతిలేని వారలలో సీతాపతిని
సతతము దలచినను హితవున వారి పూర్వ
కృతము లెల్లమాన్పి కృపతోడను జూచి
అతులిత సామ్రాజ్యానందమొందజేయు శ్రీ రా ॥

మారసుందరాకారుని వేసారక ఎపుడు
కోరి భజించుడి భూరికర్మములను
చేరనియ్యకగొట్టి చెదరగ జేసి
పారద్రోలెడి రఘుపతి నిజనామము శ్రీ రా ॥

దాసులనెల్ల బ్రోచుచు భద్రగిరి ని
వాసుడై జగములనేలు శ్రీరాముడు
దోషములెల్ల బాపి వాసిగ ధర రామ
దాస హృదయ నివాసుడైన సీతా రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Radhika Ashtottara Shatanama Stotram In Telugu