Ramanamanavi Chekonuma In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramanamanavi Chekonuma Daivaraya Lyrics ॥

అసావేరి – రూపక

పల్లవి:
రామనామనవి చేకొనుమా దైవరాయ పరాకు చేయకుమా
స్వామి భద్రాచలధామ పావనదివ్యనామ గిరిజనుత భీమపరాక్రమ రా ॥

చరణము(లు):
దరిలేని జనులనుగాచె బిరుదుబూని విఖ్యాతిగను
గురుతరశ్రమ యింత బాధలను నీ మరుగుజేరితి నన్నరమర చేయక రా ॥

కపట మానసుడని మదిని యెన్నకిపుడు రక్షింపు సమ్మతిని
అపరాధములకునే నాలయమైతిని కృపజూడుము నాదు నెపములెన్నక స్వామీ రా ॥

పతిత పావనమూర్తి నీవేగతియని యుండితి మదిలోన సతతము
రామదాసపతివై భద్రాద్రిని అతులిత వైభవ తతులచే నెలకొన్న రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Venkateswara Vajra Kavacha Stotram In Telugu