Ramaparaku Raghurama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramaparaku Raghurama Paraku Lyrics ॥

నాదనామక్రియ- తిశ్ర ఏక

పల్లవి:
రామపరాకు రఘురామ పరాకు
స్వామి భద్రశైలధామ పరాకు రా ॥

చరణము(లు):
శ్రీవత్స కౌస్తుభసింహ పరాకు
శ్రీవల్లభ కారుణ్య పరాకు రా ॥

అక్షయ పాండవపక్ష పరాకు
పక్షివాహన భక్తరక్ష పరాకు రా ॥

భద్రేభవరద దాసభద్ర పరాకు
చిద్రూప కరుణాసముద్ర పరాకు రా ॥

హీరమాణిక్య కేయూర పరాకు
తారహార యశపూర్ణ పరాకు రా ॥

కుంభనికుంభ నిర్దంభ పరాకు
గంభీరసమర విజృంభ పరాకు రా ॥

ఖండాఖండ ఉద్దండ పరాకు
చండప్రచండకోదండ పరాకు రా ॥

ప్రేమతో భద్రాద్రిధామ పరాకు
రామదాస పోష రామ పరాకు రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Jatayu Kruta Sri Rama Stotram In Telugu