Ramude Galadu Napali In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramude Galadu Napali Lyrics ॥

నాదనామక్రియ – ఏక
పల్లవి:
రాముడే గలడు నాపాలి శ్రీరాముడే గలడు
రాముడార్తి విరాముడాభావ భీముడానంద ధాముడైన శ్రీ రా ॥

చరణము(లు):
నల్లని రూపు దాసులనేలు చల్లని చూపు నుల్లమున రంజిల్ల
కృప వెదజల్లుచు విలసిల్లు సీతా రా ॥

తమ్ముడును తాను విల్లునమ్ములు దాల్చిదయతో రమ్మి
ఇరుపార్శ్వముల జేరి లెమ్మి నీకు భయమ్ములేదన రా ॥

మీరు చిరునవ్వు జిగి ముడివీడు జారుసిగపువ్వు పౌరులకు బంగారు
తమ్ములు చేరు పదముల దారి ననుజేర్చి రా ॥

కంటుజేయకను రామదాసుని జంటబాయకను వెంటనంటి
ఏవేళ కృపతో కంటిని రెప్పగాచు గతి బ్రోచు రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Rama Ashtottara Shatanama Stotram In Telugu