Ramunivaramainaramu Itaradula In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramunivaramainaramu Itaradula Lyrics ॥

నాదనామక్రియ – చాపు (యదుకులకాంభోజి – ఆది)

పల్లవి:
రామునివారమైనారము ఇతరాదుల గణనసేయము మేము రా ॥

అను పల్లవి:
ఆ మహామహుడు సహాయుడై విభవముగా మమ్ము చేపట్ట రా ॥

చరణము(లు):
యమకింకరుల జంకించెదము పూని
యమునినైన ధిక్కరించెదము
అమరేంద్రవిభవము అది యెంతమాత్రము
కమలజునైన లక్ష్యము చేయకున్నాము రా ॥

గ్రహగతులకు వెరువబోము మాకు
గలదు దైవానుగ్రహబలము
ఇహపరములకు మాకిక నెవ్వరడ్డము
మహి రామబ్రహ్మమంత్రము పూనియున్నాము రా ॥

రాముడు త్రిభువన దేవదేవుడు
రామతీర్థాల దైవలరాయడు
రామదాసుల నెల్ల శుభదాయియై చాల
బ్రోచి ప్రభుడై విభవముగా రక్షించును రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Ramarahasyokta Sri Ramashtottara Shatanama Stotram 8 In Telugu