Ravayya Abhayamu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ravayya Abhayamu Lyrics ॥

నీలాంబరి – త్రిపుట
చరణము(లు):
రావయ్య అభయము లియ్యవయ్య స్వామి ప
రాకేలనయ్య నీకు శ్రీరామయ్య
భావజ జనక నాబాధలన్నియు మాన్పి
ఏ విధముననైనను యేలెడి దొర నీవే రా ॥

కావుకావుమని కాకాసురుడు రాగ
కాచి రక్షించిన ఘనుడవు నీవు కావే
దేవదేవోత్తమ దీనదయాపర
కావవే యీవేళ కరుణాసాగర రా ॥

అన్న నాపై నీవలుగుటేమి రామన్న రా
వన్న నా మనవిని వినుమన్న ఓయన్న
అన్నన్న నా నేరమెన్నుటేమన్నా నీ
కన్నను మన్నింపనెవరున్నారన్నా రా ॥

పతితులలో పరమపతితుడనంటిని
పతితపావన బిరుదే మదిలో నమ్మియుంటి
సరగున భద్రాచలస్వామి బ్రోవుమంటి ని
తరుల వేడ నా గతి నీవే యనుకొంటిని రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Shani Deva – Ashtottara Shatanamavali In Telugu