Ravayya Bhadrachalarama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ravayya Bhadrachala Rama Lyrics ॥

బిలహరి – చాపు (- ఆది)

పల్లవి:
రావయ్య భద్రాచలరామ శ్రీరామా
రావయ్య జగదభిరామ లలామా రా ॥

అను పల్లవి:
కేవలభక్తి విలసిల్లునా
భావము దెలిసిన దేవుడవైతే రా ॥

చరణము(లు):
ప్రొద్దున నిన్ను పొగడుచు నెల్లప్పుడు
పద్దుమీరకను భజనలు చేసెద
గద్దరితనమున ప్రొద్దులు పుచ్చక
ముద్దులు గులుకుచు మునుపటివలె రా ॥

నన్నుగన్నతండ్రీ మదిలో నీ
కన్న నితరులను గొలిచెదనా ఆ
పన్నరక్షకా పర దినకర కుల
రత్నాకర పూర్ణసుధాకర రా ॥

అంజలిజేసెద నరమరలేక
కంజదళాక్ష కటాక్షము లుంచుము
ముజ్జగములకును ముదమిడు పదముల
గజ్జెలు కదలగ ఘల్లుఘల్లుమన రా ॥

దోషము లెంచని దొరవని నీకు
దోసిలియొగ్గితి తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో సరి
వాసిగ రామదాసునిక బ్రోవగ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Shri Subramanya Mantra Sammelana Trisati In Telugu