భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Saranagata Rakshana Lyrics ॥
యమునా కల్యాణి – ఏక ( – ఆది)
పల్లవి:
శరణాగత రక్షణ బిరుదనినే శరణంటి గదయ్యా
వెరువకుమని యభయంబొసంగవే నను గన్నతండ్రివయ్యా శ ॥
చరణము(లు):
కరివరదా సిరులొసగను దశరథకుమార రావయ్యా
నిరతము నీ నామము జిహ్వకు రుచికరమది యీవయ్యా శ ॥
నరహరి బాలుని గాచిన శ్రీజగన్నాథా వినవయ్యా
గరుడవాహనుడవై నా కన్నుల గనుపింపవయ్యా శ ॥
ఆదిదేవ మీ చిత్తము భాగ్యము ఆదరింపవయ్యా
నీ దాసులకును నే దాసుడ దయయుంచి యేలుమయ్యా శ ॥
హరి నీ తోటి సమానమైన మా యాప్తులెవరయ్యా
కరుణాసాగరుడవని మొరలిడగా కనికరించవేమయ్యా శ ॥
కోరితి నా దైవము నీవేయనుకొంటిని గదయ్యా
నేరములెంచక గారవించి కృప నేలు నల్లనయ్యా శ ॥
మురిపెముగా శ్రీరామదాసుడని ముచ్చటలాడుమయ్యా
నరులను బ్రోచెడి భద్రాచలపతి నీవు గాదటయ్యా శ ॥
– Chant Stotra in Other Languages –
Sri Ramadasu Keerthanalu – Saranagata Rakshana Lyrics » English