Sri Rama Namam Maruvam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Srirama Namam Maruvam Lyrics ॥

నాదనామక్రియ – చాపు

పల్లవి:
శ్రీరామనామం మరువాం మరువాం
సిద్ధము యమునకు వెరువాం వెరువాం శ్రీ ॥

చరణము(లు):
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీ ॥

విష్ణుకథలు చెవుల విందాం విందాం
వేరేకథలు చెవుల మందాం మందాం శ్రీ ॥

రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరాం దూరాం శ్రీ ॥

నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులన్నింక మేము నమ్మాం నమ్మాం శ్రీ ॥

మాధవనామము మరువాం మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం శ్రీ ॥

అవనిజపతిసేవ మానాం మానాం
మరియొక జోలంటే మౌనాం మౌనాం శ్రీ ॥

భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మనముందాం ముందాం శ్రీ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Maruvakanu Ni Divyanama Smaranameppudu In Telugu – Sri Ramadasu Keerthanalu