Tagunayya Dasaratha Ramachandra In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Tagunayya Dasaratha Ramachandra Lyrics ॥

శంకరాభరణము – రూపక (- త్రిపుట)

పల్లవి:
తగునయ్య దశరథ రామచంద్ర దయ దలుపవేమి నీవు
పగవాడనా యెంతో బతిమాలిననుగాని పలుకవేమి నీవు త ॥

చరణము(లు):
నగుమోము జూపరా నాయన్నా
నిను చాలా నమ్మినాను ఇంత
అగడుగ జూచిన నావంక
ఎవరిపాలయ్యా నేను త ॥

పతితులనెల్ల పావనుల జేయుదు
నని పలుకవేల యిపుడు
అతిఘోర ఖలుండననుచు
నన్ను విడనాడనేల త ॥

మన్నించి కావరాకున్నావు
ఓ రామ నిన్ను మాననే
నిన్నేగాని పరులనెన్నబోను
నా కన్నులార త ॥

పదపడి మిము జేరబడిన
వారల చేపట్టలేదా నన్ను
వదలిన మీవంటివారికి
యపకీర్తికాదా త ॥

అనుదినము భద్రాద్రి
రాముడవని నిన్నరసినాను
నేను వినయముతో రామదాసుడ
నని విన్నవించినాను త ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Tagunayya Dasaratha Ramachandra Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Sri Venkatesha Ashtakam 2 In Telugu