Takkuvemi Manaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Takkuvemi Manaku Lyrics ॥

పల్లవి

తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ ॥

చరణములు
ముత్చుసోమకుని మును జంపినయా
మత్స్యమూర్తి మన పక్షముండగను ॥

సురలకొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కౄప మనకుండగ ॥

దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ ॥

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ ॥

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మనపాలిట నుండగ ॥

దశగ్రీవు మును దండించినయా
దశరథరాముని దయ మనకుండగ ॥

ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమైయుండగ ॥

దుష్టకన్సుని ద్రుంచ్నట్టి
శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ ॥

కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను కావగ నుండగ ॥

రామదాసుని గాచెడి శ్రీమ
న్నారాయణు నెరనమ్మి యుండగ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Takkuvemi Manaku Lyrics » English

Other Ramadasu Keerthanas:

.

See Also  Narayana Atharvashirsha In Telugu