Thakkuvemi Manak Ramundokkadunduvaraku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Thakkuvemi Manak Ramundokkadunduvaraku Lyrics ॥

నాదనామక్రియ – ఆది (సౌరాష్ట్ర – ఆది)

పల్లవి:
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు త ॥

ప్రక్కతోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ త ॥

చరణము(లు):
మ్రుచ్చుసోమకుని మునుజంపినయా
మత్స్యమూర్తి మనపక్షమునుండగ త ॥

సురలకొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృప మనకుండగ త ॥

దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ త ॥

హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కన నుండగ త ॥

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ త ॥

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముని దయ మనకుండగ త ॥

దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ త ॥

ఇలలో యదుకులమున నుదయించిన
బలరాముడు మన బలమైయుండగ త ॥

దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతోనుండగ త ॥

కలియుగాంత్యమున కలిగిన దైవము
కలికిమూర్తి మము గాచుచు నుండగ త ॥

నారాయణదాసుని గాచిన శ్రీమన్‌
నారాయణు నెరనమ్మియుండగ త ॥

రామదాసు నిల రక్షించెదనని
ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ త ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Viththala – Ashtottara Shatanamavali In Telugu