Unnado Ledo Bhadadri In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Unnado Ledo Bhadadri Telugu Lyrics ॥

అసావేరి – త్రిపుట

పల్లవి:
ఉన్నాడో లేడో భద్రాద్రియందు ఉ ॥

చరణము(లు):
ఉన్నాడో లేడో యాపన్న రక్షకుడు
ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు ఉ ॥

నన్నుగన్న తండ్రి నా పెన్నిధానము
విన్నపము విని తా నెన్నడు రాడాయె ఉ ॥

ఆకొని నే నిపుడు చేకొని వేడితే
రాకున్నా డయ్యయ్యో కాకుత్స్థ తిలకుడు ఉ ॥

వాటముగ భద్రాచల రామదాసుతో
మాటలాడుటకు నాటకధరుడు ఉ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Unnado Ledo Bhadadri Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Shivabhujangaprayata Stotram In Telugu