Vandanamu Raghunayaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Vandanamu Raghunayaka Lyrics ॥

ఖమాఛ్‌ – త్రిపుట

పల్లవి:
వందనము రఘునాయక ఆనందము శ్రీరఘునాయకా
పొందుగ పాదారవిందము కనుగొందునా రఘునాయకా వం ॥

చరణము(లు):
ఎవరేమన్నారు రఘునాయకా నే వెరువజాల రఘునాయకా
నవనీతచోర నీ నామమె గతి యని నమ్మితి రఘునాయకా వం ॥

మన్ననతో రఘునాయకా నా మనవిని వినుమా రఘునాయకా
సన్నుతింపజాల తండ్రి సరసిజదళనేత్ర నిన్ను రఘునాయకా వం ॥

చపలచిత్తుడ రఘునాయకా నన్ను చేపట్టుమి రఘునాయకా
విపరీతగుణముల నిడుమల పడితిని ఉపాయమెరుగను రఘునాయకా వం ॥

దాసపోషక రఘునాయకా నీవు దాతవు రఘునాయక
వాసిగ భద్రాచల రామదాసుని ఆసతీర్పుము రఘునాయకా వం ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Vandanamu Raghunayaka Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Sri Raghunatha Ashtakam In Telugu