Vande Raghurama Subhanama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Vande Raghu Rama Subhanama Lyrics ॥

మోహన – చాపు (- త్రిపుట)

పల్లవి:
వందే రఘురామా శుభనామ శుభనామ
తులసీదళ దామాభిరామా శ్రీరామ వం ॥

చరణము(లు):
కనకమణిమయహార సుకుమార సుకుమార
పంక్తిరథ మహితకుమారా సువిహార
అరిసూర భూధరధీర కల్మషదూర
పాలితవానర దారుణ కారణ మురహరణ రఘు
వీర నీరదాభ విమల శరీర నిర్వికార వం ॥

వందితానిమేషా సత్యభావ సీతానన
భక్తపోష బుధతోష దళితదోష సజ్జనపోష
మానుషవేష సంగరభీషణ దాససుపోషణ నిజతోష
రత్నభూష రమ్యవేష సురాంభోజపుంజ ప్రత్యూ
ష సుమానస భృంగ మునిరాజవేష శ్రీరామ వం ॥

కుంతల జితనీల భక్తపాల భక్తపాల
అసురద్వేష పటలపాల వరశీల కనకచేల
కాంతిజాల మానుషశరీర దానవ బాలక
తావక సేవక సురసాల భూపాల పాలక
కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల వం ॥

ధరణిజ సత్కళత్ర సుచరిత్ర సుచరిత్ర
మునిస్తోత్ర హృదయాబ్జమిత్ర సత్పవిత్ర
త్రిశరజైత్ర నీరజనేత్ర వారిజగాత్ర
విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర
అజపవిత్ర అతురమిత్ర విభీషణ పరస్తోత్ర పాత్ర వం ॥

భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి
రాభ మదేభ హర్యక్ష మృదుపక్ష పంకేరుహాక్ష
నిజరూపాక్ష శత్రువిపక్ష వసురేషణ
వీక్షణ శిక్షణ దాక్షణ రామదాస
భద్రాద్రీశ దుష్టశిక్షక శిష్టరక్షక అహో రామ వం ॥

Other Ramadasu Keerthanas:

See Also  Hey Panduranga Hey Pandarinatha In Telugu