॥ Sri Sai Nakshatra Malika in Telugu ॥
॥ శ్రీ సాయి నక్షత్ర మాలికా ॥
షిరిడీసదనా శ్రీసాయీ
సుందర వదనా శుభధాయీ
జగత్కారణా జయసాయీ
నీ స్మరణే ఎంతో హాయీ ॥ ౧ ॥
శిరమున వస్త్రము చుట్టితివీ
చినిగిన కఫినీ తొడిగితివీ
ఫకీరువలె కనిపించితివీ
పరమాత్ముడవనిపించితివీ ॥ ౨ ॥
చాందుపాటేలుని పిలిచితివీ
అశ్వము జాడ తెలిపితివీ
మహల్సాభక్తికి మురిసితితివీ
సాయని పిలిచితె పలికితివీ ॥ ౩ ॥
గోధుమ పిండిని విసరితివీ
కలరా వ్యాధిని తరిమితివీ
తుఫాను తాకిడి నాపితివీ
అపాయమును తప్పించితివీ ॥ ౪ ॥
అయిదిళ్లలో భిక్షడిగితివీ
పాపాలను పరిమార్చితివీ
బైజాసేవను మెచ్చితివీ
సాయుజ్యమునూ ఇచ్చితివీ ॥ ౫ ॥
నీళ్ళను నూనెగ మార్చితివీ
దీపాలను వెలిగించితివీ
సూకరనైజం తెలిపితివీ
నిందలు వేయుట మాన్పితివీ ॥ ౬ ॥
ఊదీ వైద్యము చేసితివీ
వ్యాధులనెన్నో బాపితివీ
సంకీర్తన చేయించితివీ
చిత్తశాంతి చేకూర్చితివీ ॥ ౭ ॥
అల్లా నామము పలికితివీ
ఎల్లరి క్షేమము కోరితివీ
చందనోత్సవము చేసితివీ
మతద్వేషాలను మాపితివీ ॥ ౮ ॥
కుష్ఠురోగినీ గాంచితివీ
ఆశ్రయమిచ్చీ సాకితివీ
మానవధర్మం నెరిపితివీ
మహాత్మునిగ విలసిల్లితివీ ॥ ౯ ॥
ధునిలో చేతిని పెట్టితివీ
కమ్మరిబిడ్డను కాచితివీ
శ్యామా మొర నాలించితివీ
పాము విషము తొలిగించితివీ ॥ ౧౦ ॥
జానెడు బల్లను ఎక్కితివీ
చిత్రముగా శయనించితివీ
బల్లి రాకను తెలిపితివీ
సర్వజ్ఞుడవనిపించితివీ ॥ ౧౧ ॥
లెండీ వనమును పెంచితివీ
ఆహ్లాదమునూ పంచితివీ
కర్తవ్యము నెరిగించితివీ
సోమరితనమును తరిమితివీ ॥ ౧౨ ॥
కుక్కను కొడితే నొచ్చితివీ
నీపై దెబ్బలు చూపితివి
ప్రేమతత్వమును చాటితివీ
దయామయుడవనిపించితివీ ॥ ౧౩ ॥
అందరిలోనూ ఒదిగితివీ
ఆకాశానికి ఎదిగితివీ
దుష్టజనాళిని మార్చితివీ
శిష్టకోటిలో చేర్చితివీ ॥ ౧౪ ॥
మహల్సా ఒడిలో కొరిగితివీ
ప్రాణాలను విడనాడితివీ
మూడు దినములకు లేచితివీ
మృత్యుంజయుడనిపించితివీ ॥ ౧౫ ॥
కాళ్ళకు గజ్జెలు కట్టితివీ
లయ బద్ధముగా ఆడితివీ
మధుర గళముతో పాడితివీ
మహదానందము కూర్చితివీ ॥ ౧౬ ॥
అహంకారమును తెగడితివీ
నానావళినీ పొగడితివీ
మానవసేవా చేసితివీ
మహనీయుడవనిపించితివీ ॥ ౧౭ ॥
దామూ భక్తికి మెచ్చితివీ
సంతానమునూ ఇచ్చితివీ
దాసగణుని కరుణించితివీ
గంగాయమునలు చూపితివీ ॥ ౧౮ ॥
పరిప్రశ్నను వివరించితివీ
నానాహృది కదిలించితివీ
దీక్షితుని పరీక్షించితివీ
గురుభక్తిని ఇల చాటితివీ ॥ ౧౯ ॥
చేతిని తెడ్డుగ త్రిప్పితివీ
కమ్మని వంటలు చేసితివీ
ఆర్తజనాళిని పిలిచితివీ
ఆకలి బాధను తీర్చితివీ ॥ ౨౦ ॥
మతమును మార్చితె కసరితివీ
మతమే తండ్రని తెలిపితివీ
సకల భూతదయ చూపితివీ
సాయి మాతగా అలరితివీ ॥ ౨౧ ॥
హేమాదును దీవించితివీ
నీదు చరిత వ్రాయించితివీ
పారాయణ చేయించితివీ
పరితాపము నెడబాపితివీ ॥ ౨౨ ॥
లక్ష్మీబాయిని పిలిచితివీ
తొమ్మిది నాణెములిచ్చితివీ
నవవిధ భక్తిని తెలిపితివీ
ముక్తికి మార్గము చూపితివీ ॥ ౨౩ ॥
బూటీ కలలో కొచ్చితివీ
ఆలయమును కట్టించితివీ
తాత్యా ప్రాణము నిలిపితివీ
మహాసమాధీ చెందితివీ ॥ ౨౪ ॥
సమాధి నుండే పలికితివీ
హారతినిమ్మని అడిగితివీ
మురళీధరునిగ నిలిచితివీ
కరుణామృతమును చిలికితివీ ॥ ౨౫ ॥
చెప్పినదేదో చేసితివీ
చేసినదేదో చెప్పితివీ
దాసకోటి మది దోచితివీ
దశదిశలా భాసిల్లితివీ ॥ ౨౬ ॥
సకల దేవతలు నేవెనయా
సకల శుభములను కూర్చుమయా
సతతమునిను ధ్యానింతుమయా
సద్గురు మా హృదినిలువుమ్మయా ॥ ౨౭ ॥
సాయీ నక్షత్రమాలికా
భవరోగాలకు మూలికా
పారాయణ కిది తేలికా
ఫలమిచ్చుటలో ఏలికా
– Chant Stotra in Other Languages –
Sri Shirdi Sai Baba – Sri Sai Nakshatra Malika Lyrics in English