Abbabba Debbalaku Norvalenura In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Abbabba Debbalaku Norvalenura Lyrics ॥

అసావేరి – ఆది

పల్లవి:
అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
జబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా అ ॥

చరణము(లు):
అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో
కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య అ ॥

రట్టుతీర్చీవేళ గట్టిగా నీవునను
జెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ అ ॥

శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాద
శరధిబంధించిన శౌర్యమేమాయెరా అ ॥

పరంధామ నీ పాదములాన వినరా
పరులకొక్క కాసు నే నివ్వలేదురా అ ॥

భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడు
ప్రేమతో భజియించు రామదాసునేలు అ ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Sri Saraswati 1 – Ashtottara Shatanamavali In Telugu