భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Anabettitinani Ayasapadavaddu Ramacandra Lyrics ॥
కాంభోజి – ఆట (భైరవి – త్రిపుట)
పల్లవి:
ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా
నా పామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్రా ఆ ॥
చరణము(లు):
తామసింపక యిత్తరి నను కృపజూడు రామచంద్రా
తడయక మీ తల్లిదండ్రుల యానతీరు రామచంద్రా ఆ ॥
సేవకునిగాచి చెయిపట్టి రక్షింపు రామచంద్రా
చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్రా ఆ ॥
కోరిక దయచేసి కొదువలు దీర్చుమో రామచంద్రా
కొమరొప్ప మీకుల గురువులానదీరు రామచంద్రా ఆ ॥
నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్రా
వినయముగ సౌమిత్రి యానతీరు రామచంద్రా ఆ ॥
వేడుకమీరగ వేగరక్షింపుమీ రామచంద్రా
జోడుగ భరతశత్రుఘ్నుల యానతీరు రామచంద్రా ఆ ॥
జంటగ మీవెంట బంటుగ నేలుము రామచంద్రా
తంటలేక మీయింటి యానతీరు రామచంద్రా ఆ ॥
ఆదరింపుము నన్ను అడియే\న్ దాసుడ రామచంద్రా
వాదేల రామదాసుని బ్రోవుమిక శ్రీరామచంద్రా ఆ ॥