Ayyayyo Ne Neranaiti Adinarayanuni In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ayyayyo ne Neranaiti Adinarayanuni Lyrics ॥

మేచబౌళి – త్రిపుట

పల్లవి:
అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి అ ॥

అను పల్లవి:
వెయ్యారు జన్మాల వెత జెందితి గాని
చెయ్యన సద్గతి సాధింప లేనైతి అ ॥

చరణము(లు):
మోస మేమని తలచియుండు దోస
వాసనల తగిలితేమందు ఆశా
పాశములను అరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి అ ॥

మూడు మేలని నమ్మియుంటి నిరు
మూడు శత్రుల కూడియుంటి మాటికి
రెంటి మార్చి శత్రు మూటికెక్కువైన
కూటస్థు పొగడ నేను కూడ లేనయితి అ ॥

వదలించి బంధముల విడజేసిన భద్ర
గిరి రాఘవులతో నేను కలసి
సదయుడవైగని శ్రీరామదాసుని
స్థిరముగ పోషించుడని వేడనైతి అ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Vishnu Shatpadi Stotram In Telugu