Bhali Vairagyambento Bagaiyunnadi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Bhali Vairagyambento Bagaiyunnadi Lyrics ॥

నాదనామక్రియ – ఆది (చక్రవాకం – త్రిపుట)

పల్లవి:
భళి వైరాగ్యంబెంతో బాగైయున్నది చం
చలమైన నామనసు నిశ్చలమైయున్నది భ ॥

చరణము(లు):
అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ
హరినామస్మరణ జిహ్వకు అనువైయున్నది భ ॥

గురుధ్యానమున మనసు కుదురైయున్నది చిత్త
మిరువది యారింటిమీద నిరవైయున్నది భ ॥

పరమశాంత మెన్నగను బాగైయున్నది మాకు
పరతత్త్వమందే మా బుద్ధిపట్టియున్నది భ ॥

విరసము పోరులేని విధమైయున్నది మాకు
ప్రకృతి యెడబాసి మోక్షమునకిరవై యున్నది భ ॥

గురి భద్రాద్రీశునందే గురువైయున్నది యిప్పుడు
అరమరలేక రామదాసు డనదగియున్నది భ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Krishnashtakam 5 In Telugu