Bilvashtakam 2 In Telugu

॥ Bilvaashtakam 2 Telugu Lyrics ॥

॥ బిల్వాష్టకమ్ ౨ ॥
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ।
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 1 ॥

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః ।
తవ పూజ్యాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ॥ 2 ॥

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణ ॥ 3 ॥

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ।
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ॥ 4 ॥

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ॥ 5 ॥

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా ।
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 6 ॥

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం ।
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ॥ 7 ॥

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ ।
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 8 ॥

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః ।
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం ॥ 9 ॥

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ ।
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 10 ॥

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం ।
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 11 ॥

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే ।
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం ॥ 12 ॥

See Also  1000 Names Of Sri Gopala – Sahasranama Stotram In Telugu

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా ।
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం ॥ 13 ॥

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం ॥ 14 ॥

॥ Bilvashtakam Meaning Telugu Lyrics ॥

మూడు ధళాలు త్రిగుణముల ఆకారముగా, మూడు నేత్రములు కలవాడు, త్రిశూలము ఆయుధముగా  కలవాడు, మూడు జన్మములలోని పాపములను హరించువాడు ఐన శివునికి మూడు ఆకులగల బిల్వపత్రమును సమర్పించుచున్నాను.

ఓ మహాదేవా! చీలికలులేని కోమలమైన, శుభప్రధమైన మూడు శాఖాలుగల బిల్వపత్రముతో నిన్ను పూజించు చున్నాను,

కోటి కన్యధానములు, కోటి తిలపర్వతములను, బంగారు కొండను ధానమిచ్చిన ఎట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను

కాశీక్షెతమునంధు నివాసముగల, కాలభైరవుని ధర్శనము, ప్రయాగ క్షేత్రమున మాధవుని ధర్శనము వల్ల ఎట్టి ఫల్తము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును  శివునికి అర్పించుచున్నాను

ప్రతి సోమవారం ఉపవాస వ్రతమాచరించి, రాత్రి హోమము చేసిన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను

రామునిచే ప్రతిష్టించబడ్డ శివ లింగము, వివాహము నిర్వహించుట, ఎన్నో తాటాకము (భావి) త్రవ్వించుట, పుత్రసంతతి, కలిగియుండుట వలన ఎట్టి పుణ్యము కలుగునో  అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను

శివ సహస్రనామ పఠనముతో శివుని అర్చించడం వలన ఎట్టి పుణ్యము కలుగునో  అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను

పార్వతీ సమేతుడు, నంధివాహనుడు, భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి బిల్వధళమును సమర్పించుచున్నాను

See Also  Vishwakarma Ashtakam 1 In English

బ్రాహ్మణులకు సాలగ్రామములు ధానముచేయుట, పధికోట్ల తటాకములు త్రవ్వించుట, వేలకోట్ల యజ్ఞములు చేయుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను

అశ్వమేధముతో పాటు నూరు యజ్ఞములు చేసి, వేల కోట్ల ఏనుగులను ధానమిచ్చుట, కోటి మంధి కన్యలను ధానము చేయట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను

బిల్వధళము యొక్క ధర్శనం పుణ్యం, ధానిని తాకినా పాపములను నాశనం, ఆఘూర పాపములను నశింపజేయునట్టి బిల్వ ధళమును శివునికి అర్పించుచున్నాను

బ్రహ్మతత్వము స్థాపితమైన వేధపాఠములను వేలసార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో  అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను

వేలాధీ మంధికి అన్నధానము, వేయి ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో  అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను, గనుక నీను అనేక జన్మలలో చేసిన పాపము నశించును.

అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వస్తోత్రమును పతిచినవారికి పఠించినవారికి శివలోకము ప్రాప్తించును.

గమనిక: శివ స్తుతి స్తోత్రములను శివుని సన్నిధిలో స్మరించుట వలన మంచి పలితములను పొంధవచ్చు.

– Chant Stotra in Other Languages –

Shiva Stotram » Bilvashtakam 2 Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Tamil » Marathi