Bucivani Piluvaboduna O Gopala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Bucivani Piluvaboduna O Gopala Lyrics ॥

పంతువరాళి – రూపక

పల్లవి:
బూచివాని పిలువబోదునా ఓ గోపాలకృష్ణా బూ ॥

అను పల్లవి:
బూచివాని పిలువబోతె వద్దు వద్దు వద్దనేవు
ఆ చిచ్చి జోలపాడి ఆయిఊచిన నిదురపోవు బూ ॥

చరణము(లు):
మత్తగజముతెచ్చి చిన్నతిత్తిలో నమర్చి నాదు
నెత్తిమీద బెట్టి నన్ను ఎత్తుకోమనేవు కృష్ణా బూ ॥

అల్లమూరుగాయ పెరుగు అన్నమారగించమంటె
తల్లి వెన్నపాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు బూ ॥

రోటగట్టివేతు కృష్ణా రామదాసవరదా నీవు
మాటిమాటికిట్లు నన్ను మారాము చేసితేను బూ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Bucivani Piluvaboduna O Gopala Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Sharabhesha Ashtakam In Telugu