Tharaka Mantramu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Tharaka Mantramu Lyrics ॥

ధన్యాసి – ఆది

పల్లవి:
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా

అను పల్లవి:
మీరిన కాలుని దూతలపాలిటి
మృత్యువుయని మదినమ్ముక యున్న తా ॥

చరణము(లు):
మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా
ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు తా ॥

ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న
అన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నా
ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా తా ॥

నిర్మల మంతర్లక్ష్యభావమున నిత్యానందముతోనున్న
కర్మంబులువిడి మోక్షపద్ధతిని కన్నుల నే జూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న
మర్మము దెలిసిన రామదాసుని హృన్మందిరముననే యున్న తా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Taraka Mantramu Lyrics » English

Other Ramadasu Keerthanas:

.

See Also  Sri Durga Sahasranama Stotram In Telugu