Palayamam Jaya Rama Jaya In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Palayamam Jaya Rama Jaya Lyrics ॥

ముఖారి – ఆది
పల్లవి:
పాలయమాం జయ రామ జయ భద్రాద్రీశ్వర రామ పా ॥

చరణము(లు):
కమలావల్లభ రామజ కబంధ సంహర పా ॥
.
పరమాత్మనే శ్రీ రామజయ భక్తవరద సీతారామ పా ॥
.
కమలానాయక రామ జయ కమనీయానన రామ పా ॥

కంబుగ్రీవ రామ జయ కార్ముక పాణే పా ॥

కరిరాజప్రియ రామ జయ కౌస్తుభవక్ష రామ పా ॥

కౌస్తుభభూషణ రామ జయ కంజాత నేత్ర రామ పా ॥

కాళీయ శిక్షక రామ జయ కంబవినాశన రామ పా ॥

కరుణాంతరంగ రామ జయ కనకాంబరధర రామ పా ॥

కస్తురితిలక రామ జయ కందర్పజనక రామ పా ॥

దశరథ నందన రామ జయ దైత్య వినాశన రామ పా ॥

శరధిబంధన రామ జయ చారుసద్గుణ రామ పా ॥

అఖండరూప రామ జయ అమితపరాక్రమ రామ పా ॥

అపరిచ్ఛిన్న రామ జయ అంతర్యామిన్‌ రామ పా ॥

అనాథబంధో రామ జయ ఆత్మరక్షక రామ పా ॥

అక్రూరవరద రామ జయ అంబరీష వరద రామ పా ॥

అయోధ్యవాస రామ జయ అజ్ఞాననాశన రామ పా ॥

సీతాహృదయవిహార జయ కుత్సిత మానవ దూర పా ॥

పరమానంద విహార జయ పాలక భద్రవిహార పా ॥

See Also  109 Names Of Shree Siddhi Vinayaka – Ashtottara Shatanamavali In Telugu

సాధుపోషణ రామ జయ సజ్జనసులభ రామ పా ॥

సామగానప్రియ రామ జయ సహస్రబాహో రామ పా ॥

సనకాది వంద్య రామ జయ సదానంద రామ పా ॥

నిత్యానంద రామ జయ నిర్మలచిత్త రామ పా ॥

నిర్వికార రామ జయ నిగమగోచర రామ పా ॥

నీరజనాభ రామ జయ నిష్ప్రపంచ రామ పా ॥

నిత్యమహోత్సవ రామ జయ నిజదాసప్రియ రామ పా ॥

వీరరాఘవరామ జయ విజయార్చిత రామ పా ॥

భద్రాచలపతి రామ జయ పతితపావన రామ పా ॥

పాండవపక్ష రామ జయ పాపవినాశన రామ పా ॥

పాహి రఘూత్తమ రామ జయ పరమదయాళో రామ ప ॥

రాగరహిత రామ జయ రామదాసావన రామ పా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Palayamam Jaya Rama Jaya Lyrics in English

Other Ramadasu Keerthanas: