Rama Nanubrovagarada Nannu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Nanubrovagarada Nannu Lyrics ॥

మధ్యమావతి – ఆది (- త్రిపుట)

పల్లవి:
రామా ననుబ్రోవగరాదా నన్ను గన్న సీతా
భామామణికైనను జాలిలేదా నామీద శ్రీ రా ॥

చరణము(లు):
రామయ్యా నీకిది మరియాదా రక్షించు భా
రమే మీకు లేదా శ్రీభద్రాచల
ధామ సుంతైననెనరు తలపున
ప్రేమ నుంచరాదా నాతో వాదా రా ॥

నీలోన జగములుండుగాక నీవు
లీలతో జగములో వుందువుగాక
ఏలాగు తాళుదు నెందాక ననుబ్రోవవు
యీలాగుండుట పరాకా ఎంతో వేడితి రా ॥

ఈనాటికెంతో సులభముగ నీవను పెన్ని
ధానము దొరికెను మాకు చేసిన పుణ్య
మాన నాకన్నులాన పరదైవాలను మ్రొక్కె
దనా బరువైనానా నీవాడనుగానా శ్రీ రా ॥

ఈ సమయమున రామదాసపోషక చిద్వి
లాస భద్రాచలవాస తెలిసి కృప
చేసి రక్షింప ప్రయాసా శ్రీరామా
గాసి మాన్పి బ్రోవకుండుటిది మేలా శ్రీ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  1000 Names Of Sri Durga 2 – Sahasranama Stotram From Tantraraja Tantra In Telugu