Rama Nichetemi Kaduga In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Rama Nichetemi Kaduga Lyrics ॥

ఆనందభైరవి – రూపక (ముఖారి – ఆది)

పల్లవి:
రామా నీచేతేమి కాదుగా సీతాభామకైన చెప్పరాదుగా శ్రీ రా ॥

అను పల్లవి:
సామాన్యులు నన్ను సకలబాధలుపెట్ట
నామొరాలకించి మోమైన జూపవేమిరా రా ॥

చరణము(లు):
శరచాపముల శక్తిదప్పెనా నీశౌర్యము జలధిలో జొచ్చెనా
కరుణమాలి పైకముతెమ్మనుచు భక్తవరుల బాధింప నీ ధైర్యమెక్కడ బోయె రా ॥

శంఖచక్రములు బట్టినందుకు దాసజనుల రక్షింపవదెందుకు పంకజాక్ష భక్త
పరిపాలనలేద బింకములేని ఈపొంకము లేలయ్య రా ॥

తల్లితండ్రి నీవనుకొంటిని నాయుల్లములో నెరనమ్మియుంటిని కల్లరి
జనులు కారుబారుచేయ చల్లనికృప యిపుడు నాపై జల్లవైతివయ్యయ్యో రా ॥

యింటివేల్పు వనుకొంటిని నీవంటి దైవము లేదనుకొంటిని నొంటిగ పైకము
ఒప్పించుమని యంటె వెంటనంటి నాజంటగ రావైతివి రా ॥

అద్రిజవినుతనామ శ్రీరామ ఆశ్రితులనేమరచితివా భద్రశైలమందు వెలసి
భక్తుడైన రామదాసు భక్తితెలిసి బ్రోవకున్న భావజజనక దిక్కెవరు రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Ganesha Hrudaya Kavacham In Telugu