Ramacandrulunapai Calamucesinaru In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramacandrulunapai Calamucesinaru Lyrics ॥

అసావేరి – చాపు ( – త్రిపుట)

పల్లవి:
రామచంద్రులునాపై చలముచేసినారు
సీతమ్మ చెప్పవమ్మ నీవైన సీతమ్మ చెప్పవమ్మ రా ॥

అను పల్లవి:
కటకట వినడేమిచేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు
కర్మము లెటులుండునో గద ధర్మమే నీకుండునమ్మా రా ॥

చరణము(లు):
దినదినము మీ చుట్టు దీనతతో తిరుగ దిక్కెవ్వరో యమ్మ
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను
ఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మా రా ॥

కౌసల్యతనయుడు కపటము చేసినాడు కారణమేముండెనో
కన్నడ చేసెదవా నీ కన్నుల వైభవముతోడ
విన్నవింపగదవమ్మ నీకన్న దిక్కెవ్వరో యమ్మ రా ॥

దశరథాత్మజుడెంతో దయశాలి యనుకొంటి ధర్మహీనుడోయమ్మ
దాసజనులకు దాతయతడట వాసిగ భద్రగిరీశుడు
రామదాసుని నేలరాడట రవికులాంబుధి సోముడట రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Tripura Ashtottara Shatanama Stotram In Telugu