Ramachandra Nannu Raksimpavademo In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramachandra Nannu Raksimpavademo Lyrics ॥

సౌరాష్ట్ర – చాపు (హుస్సేని – త్రిపుట)

పల్లవి:
రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ
రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ రా ॥

చరణము(లు):
నీ చిత్తము నా భాగ్యము నిన్నే నెర నమ్మితి
ఏచక నా మొర విని నను రక్షింపవే రా ॥

భరతునివలెను పాదుకలు పూజచేయ నేర
కోరి లక్ష్మణునివలె కొలువగనేర రా ॥

ఓర్పుతో గుహునివలెను వోడనడుపనేర
నేర్పుతో నా వాలివలె నిన్నెరుగనేర రా ॥

అంగదునివలె నేనడపము బట్టనేర
సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర రా ॥

గాలిపట్టివలె నే తాలిమిగ మోయనేర
బలిమితో హనుమంతునివలె పాటుపడనేర రా ॥

లీలతో శబరివలె లాలించి విందిడనేర
మేలిమిగ సీతవలె మెప్పింపగనేర రా ॥

గజరాజువలె గట్టిగ మొఱబెట్టనేర
విజయుని సతివలె వినుతిసేయనేర రా ॥

గురిగ జాంబవంతునివలె కోరి భజింపనేర
చేరి విభీషణునివలె శరణనగనేర రా ॥

వర జటాయువువలె ప్రాణములియ్యనేర
కరము నహల్యవలె గీర్తింపగనేర రా ॥

నేను రామదాసువలె పూని మిము భజింపనేర
నన్ను రక్షింపుము భద్రాచల రామధీర రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Narasimha Stotram 3 In Telugu