Ramaprabho Nidaya Namidanu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramaprabho Nidaya Namidanu Lyrics ॥

పునాగవరాళి – ఆది

పల్లవి:
రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ

చరణము(లు):
పామరుడను జడుడను తామసుడను నేను
వర్జితంబగు నరపశువను నీ మహత్వమెన్న నెంతటివాడను రా ॥

రామరామయని దలంతు నిరంజన రామ పరుల వేడనంటి
నీ పదయుగములే నమ్మియుంటిని నన్నరమర చేయవద్దంటిని రా ॥

శ్రీహరి యని వేడుకొంటి మొరలిడి నంతానే కరివరునేలిన దొరవని నమ్మితి
నిరసించతగదు మందరగిరిధర త్రిభువన సుందర రా ॥

ఇందిరా సుందరీ మనోహర ఏల నాపై కోపము
మున్నేమిచేసితినో పాపము నీలవర్ణ నీ రూపము రా ॥

నిరతము కన్నుల జూపుము మేలొనరించెడి శ్రీలోలుడవని చాలనమ్మియుంటి
అఘములను బాపర నేను జేసెదను నీ సేవను రా ॥

ఆశించిన శ్రీరామదాసుని నిటు మోసము చేసిన దోషం బెవరిదో
వాసవార్చితాంఘ్రిజలజయుగళ కైలాస వాసనుత భద్రగిరి హరి రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Palayamam Jaya Rama Jaya In English – Sri Ramadasu Keerthanalu