Sri Raama Nee Naama Memi Ruchira In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Sri Raama Nee Naama Memi Ruchira Lyrics ॥

గౌళిపంతువరాళి – ఆది (పూరీకళ్యాణి – ఝంప)

పల్లవి:
శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా శ్రీ ॥

చరణము(లు):
కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీనామ మేమిరుచిరా శ్రీ ॥

కదళీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన నీనామ మేమిరుచిరా శ్రీ ॥

నవరసములకన్న నవనీతములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా శ్రీ ॥

పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా శ్రీ ॥

అంజనతనయ హృత్కమలంబునందు రంజిల్లు నీనామమేమిరుచిరా శ్రీ ॥

శ్రీసదాశివుడు తానేవేళ భజియించు శుభరూప నీనామ మేమిరుచిరా శ్రీ ॥

సారములేని సంసార తరణమునకు తారకము నీనామమేమిరుచిరా శ్రీ ॥

శరణన్న జనులను సరగున రక్షించు బిరుదుగల్గిన నామమేమిరుచిరా శ్రీ ॥

తుంబుర నారదుల్‌ డంబుమీరగ గానంబుజేసెడి నీనామమేమిరుచిరా శ్రీ ॥

అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Yajnvalkya Gita From Mahabharat Shanti Parva Ch 310-318 In Telugu