Tarlipodamu Cala Daya Yuncandi Ika In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Tarlipodamu Cala Daya Yuncandi Ika Lyrics ॥

పున్నాగవరాళి – ఆది (ఆనందభైరవి – ఆది)

పల్లవి:
తర్లిపోదము చాలా దయ యుంచండి ఇక
మరలి జన్మకు రాము మదిలో నుంచండి త ॥

చరణము(లు):
బార్లుగట్టి భక్తవరులు భజనలు చేయగను మూడు
ఏర్లు గలసినట్టి దారి నెరిగి వేగముగ త ॥

సోహంబనియెడి కత్తి చేగొని అట్టే
మోహపాశములనెల్ల మొదటనే ద్రుంచి త ॥

ఈషణత్రయములెల్ల నిలలోనె డించి సం
తోష సాగరంబునందే సంచరించుచును త ॥

తారక మంత్రౌషధ ధారలు గ్రోలి ఏపు
మీరగాను మోక్షపదవి హెచ్చనుచు గాంచి త ॥

ఆరు కమలములమీద నద్భుతమైన సహ
స్రార కమలమందుజేరి సంతసించుచు త ॥

చక్కని భద్రాద్రి రామస్వామి కృపను పెం
పెక్కిన రామదాసులని పేరు గాంచినారము త ॥

Other Ramadasu Keerthanas:

See Also  O Rama Ni Namam Lyrics & Meaning – Sri Ramadasu Keerthanalu