Ennenni Janmamu Lettavalayuno In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ennenni Janmamu Lettavalayuno Lyrics ॥

వరాళి – చాపు (పంతువరాళి – త్రిపుట)

పల్లవి:
ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదు ఓ రామా ఎ ॥

అను పల్లవి:
నన్నింత కన్నడజేయుట నీకు న్యాయము కాదు సుమీ ఓ రామా ఎ ॥

చరణము(లు):
మొదట నెరుగనితనమున సగమాయువు నిదురపాలై పోయెగా ఓ రామా
పదపడి తక్కిన పదియేండ్లు బాలత్వమునను బోయెగా ఓ రామా ఎ ॥

వదలక యౌవనమున పరభామలవలల దగులనాయెగా ఓ రామా
ముదిమిని సంసారాంధకూపములో జిక్కి మునిగితేలనాయెగా ఓ రామా ఎ ॥

తనువస్థిరంబని తారకనామము తలపోయలేనైతిగా ఓ రామా
దినదినము పొట్టకొరకై దీనుల వేడివేడి దీనత్వ మొందితిగా ఓ రామా ఎ ॥

అనుదినమును గురువుపదేశ యోగము నభ్యసించనైతిగా ఓ రామా
ఎనసి నిముషమైన మీపాదములపైని మనసు నిల్పగనైతిగా ఓ రామా ఎ ॥

వాసిగ నిహములో బడిన పాటులెల్ల బాపిన నామముగా ఓ రామా
మీ సేవజేసియు మిమ్మే నమ్మిన భవపాశము లంటవుగా ఓ రామా ఎ ॥

లేశమైన కృపజేసి భద్రాచలవాస కావగరావుగా ఓ రామా
ఆశతో నే రామదాసుడనని మీకు దోసిలొగ్గితిగా ఓ రామా ఎ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Adi Shankaracharya’S Soundarya Lahari In Telugu