Sri Durga Parameshwari Stotram In Telugu

॥ Sri Durga Parameshwari Stotram by Sringeri Jagadguru Telugu Lyrics ॥

॥ శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం ॥
(శృంగేరీ జగద్గురు విరచితం)

[** అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానం ప్రాణాపాయకరస్య కొరోనా నామకస్య రోగవిశేషస్య నివారణార్థం శృంగేరీ జగద్గురు విరచిత శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్ర పారాయణం కరిష్యే – **]

ఏతావన్తం సమయం
సర్వాపద్భ్యోఽపి రక్షణం కృత్వా ।
దేశస్య పరమిదానీం
తాటస్థ్యం వహసి దుర్గామ్బ ॥ ౧ ॥

అర్థం: ఇప్పటి వరకు దేశమును అన్ని ఆపదల నుంచి కాపాడావు. ఓ దుర్గాంబా, ఇప్పుడు నువ్వు ఏమీ పట్టించుకోనట్టుగా ఉన్నావు.

అపరాధా బహుశః ఖలు
పుత్రాణాం ప్రతిపదం భవన్త్యేవ ।
కో వా సహతే లోకే
సర్వాంస్తాన్మాతరం విహాయైకామ్ ॥ ౨ ॥

అర్థం: పిల్లలు అడుగడుగునా చాలా తప్పటడుగులు వేస్తారు. ఈ లోకంలో వారిని కన్నతల్లి కాకుండా అవన్నీ ఇంకెవరు సహించగలరు?

మా భజ మా భజ దుర్గే
తాటస్థ్యం పుత్రకేషు దీనేషు ।
కే వా గృహ్ణన్తి సుతాన్
మాత్రా త్యక్తాన్వదామ్బికే లోకే ॥ ౩ ॥

అర్థం: అలాంటి కన్నతల్లులు కూడా వదిలేసిన దీనావస్థలో ఉన్న పిల్లలను, ఓ దుర్గమ్మా, నీవు కూడా పట్టించుకోకుండా ఉంటే ఇంకెవరు రక్షిస్తారు?

ఇతః పరం వా జగదమ్బ జాతు
దేశస్య రోగప్రముఖాపదోఽస్య ।
న స్యుస్తథా కుర్వచలాం కృపామ్
ఇత్యభ్యర్థనాం మే సఫలీకురుష్వ ॥ ౪ ॥

See Also  Sri Maha Ganapati Mantra Vigraha Kavacham In Telugu

అర్థం: కాబట్టి, ఓ జగదంబా (లోకాన్ని కన్నతల్లీ), ఈ రోగంతో దేశానికి వచ్చిన ముఖ్యమైన ఆపదను తొలగించు. నీ కరుణను స్థిరముగా చూపుము. నా ఈ అభ్యర్థనను (కోరిక) సఫలము చేయి.

పాపహీనజనతావనదక్షాః
సన్తి నిర్జరవరా న కియన్తః ।
పాపపూర్ణజనరక్షణదక్షాం
త్వాం వినా భువి పరాం న విలోకే ॥ ౫ ॥

అర్థం: ఏటువంటి పాపము లేకుండా, నశించిపోకుండా, జనులను రక్షించేవారు (దేవతలు) ఎవరైనా ఉన్నరా? ఓ దుర్గమ్మా, నువ్వు తప్ప పాపము చేసిన జనులను కూడా రక్షించగల సమర్థత ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదు. కాబట్టి రక్షించు.

ఇతి శృంగేరీ జగద్గురు విరచితం శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం ॥

– Chant Stotra in Other Languages –

Sri Durga Parameshwari Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil